ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాణిగా జీవితం గడిపి సప్తబుషుల బోధనలను ద్వారా మహర్షి వాల్మీకి మారి అధ్బుతమైన రామాయణం గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడని అన్నారు.