మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, యువత గంజాయి వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలని, ప్రజలు నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేగావత్ తండా గ్రామ యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయమన్నారు.