నియమ, నిబంధనలకు అనుగుణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల, ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనుమతి కోసం ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.