రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తుంది. గత వారం పది రోజులుగా అధిక వేడి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. వేసవి కాలంలో కూడా ఇంత ఎండ వేడిమి లేదని ప్రజలు చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా పలు సూచనలు చేశారు.