కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఆదివారం జింక మల్లన్న స్వామీ జాతర ఘనంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలని అందరిని సల్లంగా చూడూ స్వామి అంటూ భక్తులు మల్లన్న స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం డప్పుచప్పుల మధ్య ఒగ్గుకళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. మల్లన్న జాతరతో సిరికొండ సందడిగా మారింది.