మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్ల పట్టణంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు రెండు నెలల వేతనం మాత్రమే ఇచ్చి, మరో నాలుగు నెలల వేతనం ఇవ్వలేదన్నారు. కనీస వేతన చట్ట ప్రకారం మున్సిపల్ కార్మికులకు రూ. 26,900 చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.