రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.