సింగరేణికి సంబంధించి బుధవారంపేట గ్రామంలో చేస్తున్న భూ సేకరణ ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే దరఖాస్తు సమర్పించాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని రామగిరి మండలం బుధవారంపేట గ్రామంలో సింగరేణి భూసేకరణ ప్రక్రియపై సంబంధిత రైతులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్ డిసి ప్రత్యేక డిప్యూటీ తహశీల్దార్ తిరుపతి, సింగరేణి అధికారులు, రైతులు పాల్గొన్నారు.