ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ. 33, 03, 828ల విలువ గల చెక్కులను శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.