ఇచ్చిన హామీ అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్దపల్లిలో చేపట్టిన నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. గురువారం పెద్దపల్లిలో నిరవధిక సమ్మెలో భాగంగా తమను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని జెఏసి నాయకులు స్పష్టం చేశారు. పెద్దపల్లి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా జెఏసి అద్యక్షులు తిప్పని తిరుపతి, రాష్ట్ర నాయకురాలు పుల్లూరి సంధ్యారాణి పాల్గొన్నారు.