పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్ షిప్ లు తక్షణమే చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ గేట్ ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం పాల్గొన్నారు.