పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలని మంథని డీఎల్పీఓ సతీష్ అన్నారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో శుక్రవారం పర్యటించి, గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వాహణ సరిగ్గా ఉండాలని ఆదేశించారు. కంపోస్ట్ ఎరువు కొరకు నిర్మించిన సెగ్రేషన్ షెడ్డు పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. నవంబర్ ఆఖరిలోగా ఇంటి పన్ను వసూలు చేయాలని, ట్రేడ్ లైసెన్సులు చేయాలని సూచించారు. గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు.