కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. జూలపల్లి మండలం పెద్దాపూర్, తేలుకుంట, నాగులపల్లి, చీమలపేట, ఎలిగేడులో సింగిల్ విండో, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్, సింగిల్ విండో చైర్మన్లు పుల్లూరి వేణుగోపాల్ రావు, గోపు విజయ భాస్కర రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.