తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని మంథని బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ నాయకులు మంథని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాతో పాటు రుణ మాఫీ కూడా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.