శంకరపట్నం మండల కేంద్రంలో మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ్యేల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుతర్యాలీ సోమవారం నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం బాధ్యత వహించి ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మతోన్మాద చర్యలను అణిచివేయాలని కోరారు. మండల పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ షడ్రక్, ట్రెజరర్ ఆనందం, ఆ. సె కుమార్ తదితరులు పాల్గొన్నారు.