
జమ్మికుంట: కాలుపోయిన వ్యక్తికి జైపూర్ ఫుట్ అందజేత
జమ్మికుంట అంబేడ్కర్ కాలనీకి చెందిన వడ్లూరి పోచయ్య కొన్నేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కుడికాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఆలయ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ జైపూర్ ఫుట్ అందజేశారు. మంగళవారం గాదె గుణసాగర్ మాట్లాడుతూ ఎంపీ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పరికిపండ్ల నరహరికి పోచయ్య సమస్యను తెలపగా జైపూర్ ఫుట్ అందించడానికి సహకరించారన్నారు.