గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు మహాధర్నాలకు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్(సీఐటీయూ ) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా జగిత్యాల పాత కలేక్టరెట్ కార్యాలయం నుండి ర్యాలీ గా వచ్చి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయంలో ఏవోకి సోమవారం వినతిపత్రం అందజేశారు.