జగిత్యాలలో మున్సిపల్ కార్యాలయంలో కాకా జయంతి

58பார்த்தது
జగిత్యాలలో మున్సిపల్ కార్యాలయంలో కాకా జయంతి
జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాకా జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో విశిష్టమైన రాజకీయ శైలిని అవలంబించిన మహానేత గడ్డం వెంకట స్వామి (కాకా) అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி