జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెలలో తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ బి. ఎస్ లత తో కలిసి సందర్శించడం జరిగిందని తెలిపారు. వారి వెంట ఎమ్మార్వో రాంమోహన్, ఎలక్షన్ సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.