ధర్మపురి పట్టణంలో ఈనెల 17 తారీఖున జరిగిన కిడ్నాప్ కేసులో నిందితులను ధర్మపురి పోలీసులు బుధవారం సాయంత్రం రాయపట్నం స్టేజి వద్ద నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు సిఐ బిల్లా కొటేశ్వర్ వెల్లడించారు. ధర్మపురి పట్టణానికి చెందిన సంగి నరేష్ పంబాల యుగంధర్ ఇద్దరు భాగస్వామ్యంగా కొడిమ్యాల మండలంలో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. కొంత కాలం తర్వాత యుగేందర్ కు రోడ్డు ప్రమాదం జరగడం తో బంక్ నిర్వహణ నరేష్ చూస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల రావడంతో పంబాల యుగంధర్ ఈనెల 17వ తేదీన తుమ్మ ఉపేందర్ పులి శెట్టి శ్రవణ్ , ఎస్ కే అసల్లం, పెండ్యాల అశ్విన్ ల సహాయం తో సంగి నరేష్ ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుండి రాడ్లు, కత్తి, గ్లౌజ్లు, ప్లాస్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకొనుటలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ లు శంకర్, కానిస్టేబుళ్లు లింగారెడ్డి, రమేష్ నాయక్ లను సిఐ కొటేశ్వర్, ఎస్ఐ కిరణ్ కుమార్ లు అభినందించారు.