కొండగట్టు అంజన్న క్షేత్రంలో అన్నదానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి ఏటా రూ. 20 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ కేవలం శని, మంగళవారాల్లో 200 మందికి మాత్రమే అన్నదాన సత్రం చేస్తున్నారు. మిగతా రోజుల్లో 100 మందికి చేస్తున్నారు. అన్నదాన సత్రంలో భోజనం చేయాలని చాలామంది భావించినా అవకాశం లభించక తీవ్ర నిరాశ చెందుతున్నారనీ గురువారం మీడియాతో వాపోయారు.