మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనంగా ఉంటూనే తన మేదస్సుతో దేశ రూపురేఖలను మార్చారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికి మేలు చేశాయి. ప్రతి రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పని చేసేవారు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులను శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలోనే 2005లో విప్లవాత్మక సమాచార హక్కు, ఉపాధి హామీ పథకం, వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్ల కేటాయింపు జరిగింది. మాటలు చెప్పే నేత కాదు.. చేతల్లో చూపించారు మన్మోహన్ సింగ్.