కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం కేంద్రం లో ఆర్ఎంపి, పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్, కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో వైద్య సేవలు బంద్ చేసి నల్లబ్యాడ్జ్ లు ధరించి నిరసన తెలిపి, అనంతరం మహాత్మ గాంధీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పీజీ డాక్టర్ ను అత్యంత పాశవికంగా మానభంగం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు.