ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నాలుగు పరుగులకు ఔట్ అయ్యారు. మొదటి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన రెండో బంతికి ఫిల్ సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయింది.