రేషన్‌ దుకాణాల్లో సర్వర్‌ సమస్య

62பார்த்தது
రేషన్‌ దుకాణాల్లో సర్వర్‌ సమస్య
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచి సన్న బియ్యం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రేషన్‌ దుకాణాల్లో శనివారం ఉదయం సర్వర్‌ సమస్య తెలెత్తింది. సర్వర్‌ మొరాయించడంతో బియ్యం పంపిణీ నిలిచిపోయిందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చౌక ధరల దుకాణాల వద్ద రేషన్‌ కార్డుదారులు నిరీక్షించారు. అయితే మూడు గంటల తరువాత సాంకేతిక సమస్యను సవరించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி