SBI ‘హర్ ఘర్ లఖ్‌పతి’ స్కీంను భారతీయ నివాసితులు వ్యక్తిగతంగా గానీ, జాయింట్‌గా గానీ తెరవొచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు సైతం RDని తెరవొచ్చు. లేదా తల్లిదండ్రులు/ సంరక్షకులు వారి పేరు మీద ఓపెన్ చేయొచ్చు. మూడేళ్ల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి ఉంటుంది. నిర్ణీత కాలానికంటే ముందుగానే రూ.5 లక్షల్లోపు విత్‌డ్రా చేస్తే 0.50 శాతం, రూ.5 లక్షలు పైబడి ఉంటే 1 శాతం పెనాల్టీ చెల్లించాలి. సకాలంలో చెల్లించకుంటే పెనాల్టీ విధిస్తారు.