జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన 269 వాహనాలను యజమానులు తీసుకెళ్లకుంటే వేలం వేస్తామని ఎస్పీ రూపేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులను గుర్తించేందుకు ప్రయత్నించగా అడ్రస్ లు లభించలేదని పేర్కొన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఆరు నెలల్లో తీసుకెళ్లాలని చెప్పారు. లేకుంటే బహిరంగ వేలం వేస్తామని తెలిపారు.