భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ రూంకు 22 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోకి వరద నీరు వచ్చిందని, రోడ్లు కోతకు గురయ్యాయని ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించాలని సూచించారు.