పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రతి ఒక్కరి వినియోగించుకోవాలి

1419பார்த்தது
పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రతి ఒక్కరి వినియోగించుకోవాలి
పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కల్హేర్ జడ్పిటిసి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పాముకాటుకు విద్యుత్ షాక్ తో చనిపోయిన వారికి కూడా ఈ స్కీము ఎంతో వర్తిస్తుందని ఖాతాదారులు మరణిస్తే రూ. 10లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ. 10లక్షలు, పక్షిక వైకల్యానికి రూ. 10లక్షలు, వైద్య ఖర్చుల కింద రూ. 60వేలు, విద్య ప్రయోజనాల కింద రూ. 1లక్ష, ఆసుపత్రిలో రోజువారి నగదు కింద. 10 రోజుల వరకు రోజుకు రూ. వెయ్యి లెక్కిస్తారని ఎందుకు గాను రూ. 399 తో ఇన్సూరెన్స్ చేసుకోవాలని తెలిపారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాదారులకు ఈ పథకము అందుబాటులో ఉంటుందని చికిత్స సమయంలో ఖర్చులకోసం రూ. 60వేలు, ప్రమాదవశత్తు గాయం అయితే రూ. 30 వేలు ఇస్తారని ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం ఆధారపడిన వారికి రూ. 5000 సహాయం, పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష పరిహారం అందిస్తుందని తెలియపరిచారు. ఈ స్కీం ఖాతాదారుడికి 18 నుండి 65 ఏళ్ల మధ్య ఉండాలని వివరాలకు స్థానిక పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించాలని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி