ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజర్స్ కార్యదర్శిగా జిన్నారం మండలం నల్తూరు హిందీ ఉపాధ్యాయుడు మహమ్మద్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో అబ్దుల్లాను ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ, తనకు జాతీయస్థాయిలో అవకాశం కల్పించినందుకు సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.