ఖేడ్ లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

65பார்த்தது
ఖేడ్ లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగులాయిల దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఆదివారం నారాయణఖేడ్ లో డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, పండరినాథ్, సంజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி