అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలను అందించడమే లక్ష్యంగా స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించడం జరిగిందని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని దానిలో భాగంగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా అర్హులైన అందరికీ తెలంగాణ రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డులు వచ్చేలా పోరాటం చేసిందన్నారు.