అల్లు అర్జున్‌పై మంత్రి కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'హరీశ్ రావు, కేటీఆర్ ఐకాన్ స్టార్ ను అరెస్ట్ చేస్తారా? అంటున్నారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి?. రూ. వేల కోట్లు పెట్టి సినిమా తీస్తే మాకేం సంబంధం. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు. యాక్టర్‌వి అయితే యాక్టింగ్ చేసుకో. దేశ భక్తులు, తెలంగాణపై సినిమాలు తీస్తేనే బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తాం. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.