చెన్నై సూపర్ సింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన గ్లెన్ మాక్స్‌వెల్ సరసన చేరాడు. మాక్స్‌వెల్ ఇప్పటి వరకు 18 సార్లు డకౌట్ కాగా తాజాగా రోహిత్ శర్మ కూడా 18 సార్లు 0 పరుగుల వద్ద అవుట్ అయి రికార్డు నెలకొల్పాడు. దినేశ్ కార్తీక్ కూడా 18 సార్లు డకౌట్ అయి వీరిద్దరి సరసన నిలిచాడు.