అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూనే సీఎం రేవంత్‌పై తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న ప్రశ్నల వర్షం కురిపించారు. 'ఫుడ్ పాయిజన్‌తో పిల్లల చావులకు బాధ్యులు ఎవరు? రుణమాఫీ అవ్వక మరణించిన రైతుల ప్రాణాలకు బాధ్యులెవరు? ఆత్మహత్య చేసుకున్న చేనేత సోదరుల మరణాలకు కారణమెవరు? ఇతర సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం లేదా?' అన్నారు. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారని 'X' వేదికగా విమర్శించారు.