మెట్రో రైళ్లపై ఆ ప్రకటనలు తీసేయండి: ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

63பார்த்தது
మెట్రో రైళ్లపై ఆ ప్రకటనలు తీసేయండి: ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్‌ యాప్స్‌ ప్రకటనలను తక్షణమే తొలగించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆదేశించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రకటనలపై ఆయన గురువారం స్పందించారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీలను ఆదేశించామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி