ప్రధాని మోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’కు దరఖాస్తు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జనవరి 14 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మొదట https://innovateindia1.mygov.in వెబ్‌సైట్‌కు వెళ్లి Participate now అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ క్యాటగిరీని ఎంచుకొని పూర్తి పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఫామ్ నింపి, సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తి అయినట్టే.