కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌ పార్టీలా?: బండి సంజయ్‌

53பார்த்தது
కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌ పార్టీలా?: బండి సంజయ్‌
కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌ పార్టీలా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. 'రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పై కేటీఆర్‌ ఇప్పుడేమంటారో. డ్రగ్స్‌ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో? కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ ఫుటేజ్‌ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలి' అని డిమాండ్‌ చేశారు. కాగా శనివారం అర్ధరాత్రి జన్వాడలో ఫాంహౌస్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி