ఉత్తరప్రదేశ్లోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మోహన్లాల్గంజ్లో ఓ ఆరేళ్ళ అమాయక బాలికపై తాంత్రిక్ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు కోపంతో రగిలిపోయి బాబాను కర్రలతో ఘోరంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో వైరల్గా మారింది.