ప్రపంచానికి అహింస, సత్యాగ్రహాన్ని ప్రభోదించి, శాంతిమంత్రమే హక్కుల సాధనకు పోరాటమార్గమని నిరూపించిన ఘనులు మహాత్మ గాంధీ అని అలాగే అలాగే జై జవాన్, జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడు అని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ కీర్తించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.