సేవా గుణంతో వైద్య సేవలు అందించండని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ శుక్రవారం అన్నారు. ఓ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సేవాగుణంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మెప్పును పొందాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని, దీంతో ప్రజలు ఆందోళనకు గురై అవగాహన రహిత్యంతో తమ సంపదను వైద్యానికి విచ్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.