హైదరాబాద్: 'ఇన్స్టాగ్రామ్' బాలిక హత్య.. కీలక విషయాలు
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువకుడు బాలికను హత్య చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విఘ్నేష్ (చింటూ) కోసం బాలిక గత నెల 20న ఇంటి నుంచి వెళ్లిపోయింది. చింటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దగ్గరయ్యాడు. బాలిక పెళ్లికి ఒత్తిడి తేగా దండలు మార్చుకున్నారు. అదే సమయంలో ఇన్స్టాగ్రామ్లో మరొకరితో చాట్ చేస్తోందని అనుమానించి విఘ్నేష్ ఆమెను చంపేశాడు.