తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా జరుగుతున్న గ్రూప్-3 పరీక్షలు రాసేందుకు లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరిలోనే కొంతమంది తల్లులు కూడా ఉన్నారు. పరీక్ష రాసేసమయంలో తమ చిన్నారులను ఎక్కడ ఉంచాలో తెలియక సతమతమవుతున్న పిల్లలకు పోలీసులు మేమున్నామంటూ.. అండగా నిలుస్తున్నారు. తల్లులు పరీక్షలు రాసి వచ్చేంత వరకు చిన్నారుల అలనా పాలనా చూసుకుంటూ వారిని ఆడిస్తున్నారు. సోమవారం శేరిలింగంపల్లిలో అలాంటి ఘటనే జరిగింది.