ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథం-NITHM)లో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు పాల్గొన్నారు. పర్యాటకులకు ఆతిథ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు మంత్రి అవార్డులను అందజేశారు. సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.