మాదాపూర్ లో స్ట్రీట్ వెండర్స్ ల ఆధ్వర్యంలో గురువారం నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఐటీసీ కోహినూర్ సమీపంలో ఫుట్ పాత్ మీద ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసిన వారిని ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ స్ట్రీట్ వెండర్స్ కోరుతున్నారు.