తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ విద్యార్థులు గురువారం గాంధీ ఆసుపత్రి ముట్టడించేందుకు యత్నించారు. బోయగూడ లోని నర్సింగ్ కళాశాల, హాస్టల్ లో డ్రైనేజీ సమస్య మూలంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రి అధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.