ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మోహన్ నాయుడు ఆరోగ్య సమస్యలతో కొద్దిరోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ రాశారు. ఇది ఎప్పటికీ పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చే నష్టమని మోదీ పేర్కొన్నారు. కాగా, లేఖ ద్వారా తనను పరామర్శించినందుకు నారా రోహిత్ ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.