తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి టిఆర్ఎస్ నేత హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఇంటి ముందు, చేతులు కట్టుకొని నిలబడి, బిచ్చం ఎత్తుకొన్న రోజులు మర్చిపోయావా. నీదో స్థాయి. నీదో బతుకు నాకు తెలుసు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. చెప్పులు కొనుక్కోవాలన్నా, నా ఇంటి దగ్గరికొచ్చి, చేతులు కట్టుకున్న రోజులు మర్చిపోయినట్టున్నడు అంటూ వ్యాఖ్యానించారు.