తెలంగాణలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకు బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తెలిపారు. ఈనెల 28నుంచి అధికారుల ఇళ్లకు వస్తారని, వారు అడిగిన సమాచారం ఇవ్వాలని బుధవారం ఆయన ప్రజలను సూచించారు. కులగణన జరగాలని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని, గణన జరిగితే వెనకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన ఎప్పుడో చెప్పాలని మాజీ ఎంపీ అన్నారు.