పంట నష్టం నిధులు విడుదల: మంత్రి తుమ్మల

85பார்த்தது
పంట నష్టం నిధులు విడుదల: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు 79, 574 ఎకరాల పంట నష్టానికి గానూ 79, 216మంది రైతుల ఖాతాలకు రూ. 79. 57 కోట్లు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

தொடர்புடைய செய்தி